తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3కి నాగార్జున హోస్టింగ్ చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే అయిదు వారాలు పూర్తి చేసుకుని ఆరవ వారం నడుస్తున్న బిగ్‌బాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు నానా తిప్పలు పడుతోంది. టీఆర్పీ రేటింగ్ భారీగా తగ్గడంతో ఏం చేయాలో పాలుపోక జుట్టు పీక్కుంటున్నారు. ఇదే సమయంలో నాగార్జున అనారోగ్యం వార్తలు ప్రస్తుతం బుల్లి తెర ప్రేక్షకులకు షాక్ ఇస్తున్నాయి. గత నాలుగు రోజులుగా నాగార్జున తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నట్లుగా తెలుస్తోంది.
నాగార్జున అనారోగ్యం కారణంగా ఈవారం బిగ్‌బాస్ ఎపిసోడ్స్‌కు హోస్టింగ్ ఎవరు చేస్తారు అంటూ చర్చ మొదలైంది. నాగార్జున ప్రస్తుతానికి అయితే మెల్లగా జ్వరం నుండి కోలుకుంటున్నాడు. మరో మూడు రోజులకు ఎపిసోడ్స్‌కు సంబంధించిన చిత్రీకరణ ఉంటుంది. కనుక అప్పటి వరకు జర్వం నుండి పూర్తిగా నాగ్ బయట పడే అవకాశం ఉందని కొందరు అంటుంటే మరి కొందరు మాత్రం ఈ వారంలో నాగ్ కాకుండా మరెవ్వరైనా బిగ్‌బాస్ స్టేజీపై కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. అలా అయితే ఎలా ఉంటుందో చూద్దాం.