Site icon TeluguMirchi.com

నాగార్జున ఆఫీసర్ ఫస్ట్ లుక్

నాగార్జున కథానాయకుడిగా వర్మ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి ‘ఆఫీసర్‌’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో నాగ్‌ తుపాకీ ఎవరికో గురిపెట్టి కనిపించారు.

‘పోలీసులు ఎప్పుడూ ఇంత భయంకరంగా లేరు’ అని ఫస్ట్ లుక్ పై రాసి ఉంది మే 25న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ ముంబయిలో జరుగుతోంది. ఓ పాపను కాపాడే నేపథ్యంలో సాగే చిత్రమిది.

కాగా ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా వర్మ ఒక ట్వీట్ చేశారు. శ్రీదేవి చుట్టూ ప్రతికూల ప్రచారం తర్వాత కాస్త సానుకూలమైన దాని కోసం ఎదురుచూశానని, అందుకే నాగార్జున హీరోగా తెరకెక్కిస్తున్న సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశానని చెప్పారు.

Exit mobile version