Site icon TeluguMirchi.com

ఫొటోటాక్‌ : నాగ్‌ కొత్త టాటూ విశేషం

నాగార్జున చేయిపై ఒక టాటూ ఉంటుందనే విషయం మనకు అందరికి తెల్సిందే. ఎప్పుడో మన్మధుడు సమయంలో ఆ టాటూను వేయించుకున్నాడు. తాజాగా తన 60వ పుట్టిన రోజు సందర్బంగా నాగార్జున చేతిపై కొత్త టాటూను వేయించుకున్నాడు. నాగార్జున టాటూ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. నాగార్జున తన చేయిపై వేయించుకున్న బిగ్‌బాస్‌ షోలో పెద్ద చర్చ జరిగింది. గెస్ట్‌ గా వచ్చిన నాని తన చేతిపై ఉన్న టాటూ గురించి చెప్పాల్సిందిగా నాగార్జునను కోరడం జరిగింది.

నాగార్జున తన చేతిపై ఉన్న పాము ఆకారపు టాటూ గురించి నానికి మరియు ఇంటి సభ్యులకు తెలియజేశాడు. పాము ఎలా అయితే తన చర్మంను అప్పుడప్పుడు వదిలేస్తుందో అలాగే నేను చెడును ఎప్పటికప్పుడు వదిలేస్తూ ఉంటాను. అలాగే కన్ను గుర్తు నా మూడవ కన్ను. ఇక పైన ఉన్న ఎన్‌ అనే లెటర్‌ తన పేరులోని మొదటి అక్షరం అన్నట్లుగా నాగార్జున చెప్పుకొచ్చాడు. అయితే ఈ టాటూ గురించి బిగ్‌బాస్‌లో నానితో చర్చకు ఎందుకు తీసుకు వచ్చారో ఎవరికి అర్థం కాలేదు.

Exit mobile version