అఖిల్ తదుపరి చిత్రాన్ని ‘గీతా గోవిందం’ ఫేం పరుశురామ్ తెరకెక్కించనున్నట్టుగా తెలుస్తోంది. పవరుశురామ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది. దాంతో పరుశురామ్ అఖిల్, నాగ్‌లకు ఒక స్టోరీ లైన్ వినిపించారట. అది నచ్చి నాగ్ పూర్తి స్క్రిప్టుతో రమ్మనగా తాజాగా దర్శకుడు నాగ్, అఖిల్‌లకు పూర్తి కథను వినిపించాడు. అది నచ్చిన నాగ్ పరుశురామ్‌కు ఓకే చెప్పినట్టుగా సమాచారం. ఈ చిత్రాన్ని అఖిల్ హీరోగా నాగ్ నిర్మించనున్నాడు. త్వరలోనే అధికారికంగా ప్రకటించి సెట్స్ మీదకు తీసుకెళ్లాలని నాగ్ ప్లాన్ చేస్తున్నాడని విశ్వసనీయ సమాచారం.