నాగార్జున టాలీవుడ్ టాప్ స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాని ఈయన సినిమాలు కలెక్షన్స్ పరంగా యంగ్ హీరోలతో పోటీ పడలేక పోతున్నాయి. కాని ఈసారి మన్మధుడు 2 చిత్రం మాత్రం యంగ్ హీరోలకు సరైన ధీటుగా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాల్లో నమ్మకం వ్యక్తం అవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటి వరకు నాగార్జున నటించిన ఏ సినిమాకు కూడా ఈ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ అవ్వలేదు.
థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆన్ లైన్ స్ట్రీమింగ్ రైట్స్ ఇలా అన్ని రైట్స్ ద్వారా సినిమాకు దాదాపుగా 55 కోట్ల వరకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక సినిమా హిట్ అయితే వచ్చే కలెక్షన్స్ అదనం అని చెప్పుకొవచ్చు. మొత్తానికి మన్మధుడు 2 చిత్రంతో నాగార్జున సరికొత్త రికార్డులను సృష్టించాడు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఇక కీర్తి సురేష్ కీలక పాత్రలో కనిపించబోతుంది. సమంత కూడా ఈ చిత్రంలో ఒక పాత్రను పోషించింది. ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంకు చాలా ప్రత్యేకతులు ఉన్నాయి. అందుకే నాగ్ కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ బిజినెస్ చేసిన మూవీగా నిలిచింది.