ఫారిన్‌లో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ప్లే బాయ్‌గా కనిపిస్తాడని అంటున్నారు. ట్రైలర్ చూస్తుంటే అది నిజమేనేమో అనిపించింది. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మన్మధుడు మరీ అంత రొమాంటిక్ ఏమీ కాదని, సినిమాలో ఒకటి రెండు సీన్స్‌లో మినహా నాగార్జున మరీ రొమాంటిక్‌గా ఏమీ ఉండడని, ముద్దు సీన్స్ కూడా మరీ హద్దులు దాటి ఉండవని తాజాగా వచ్చిన సెన్సార్ రిపోర్ట్‌ను బట్టి అర్థం చేసుకోవచ్చు. నాగార్జున ఆరు పదుల వయసులో తెగ రొమాన్స్ చేస్తున్నాడంటూ వచ్చిన వార్తలు సినిమా విడుదల తర్వాత పుకార్లే అని తేలిపోవడం ఖాయం.