ఆ మన్మధుడు ఈ మన్మధుడు పూర్తిగా వేరు అంటూ మొదటి నుండి చిత్ర యూనిట్ సభ్యులు చెబుతూ వస్తున్నారు. ఇక మన్మధుడు 2 చిత్రంకు తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సినిమాలో కాస్త రొమాంటిక్ సీన్స్ ఎక్కువ ఉన్న కారణంగా చిన్న చిన్న బీప్స్ బ్లర్స్ వేసి యూ/ఎ సర్టిఫికెట్‌ను సెన్సార్ బోర్డు ఇవ్వడం జరిగింది. ఇక సినిమా పట్ల సెన్సార్ బోర్డు సభ్యులు పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారనే టాక్ వస్తుంది. నాగార్జున ఈమద్య కాలంలో ఇంతటి భారీ క్రేజ్ మూవీతో వచ్చిందే లేదు. దాంతో సినిమాను అన్ని ఏరియాల్లో కూడా మంచి రేట్లకు బయ్యర్లు కొనుగోలు చేయడం జరిగింది.