నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘మన్మధుడు 2’ చిత్రం తీవ్రంగా నిరాశ పర్చింది. ఈ వయసులో ఇలాంటి సినిమాలు ఏంటీ అంటూ నాగార్జునకు ప్రేక్షకులు ఈ సినిమాను ఫ్లాప్ చేయడం ద్వారా బుద్ది చెప్పినట్లయ్యింది. ఇతర భాషల్లో నడుస్తాయేమో కాని ఇక్కడ మాత్రం ఇలాంటివి నడవవు అంటూ నాగార్జునకు ప్రేక్షకులు గట్టి షాక్ ఇచ్చారు. ఇలాంటి సమయంలో నాగార్జున ఆలోచనల్లో పడ్డట్లుగా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జున తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్తలు పడుతున్నాడు.
ఇకపై ఎక్కువ రొమాంటిక్ సీన్స్ చేయకుండా లైట్‌గా ఉండే పాత్రలు చేయబోతున్నాడు. నాగార్జున చాలా కాలంగా అనుకుంటున్న బంగార్రాజు పాత్రను చేయబోతున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ చిత్రంలో నాగార్జున మరియు నాగచైతన్య కలిసి నటించబోతున్నారు. ప్రస్తుతానికి నాగార్జున వద్ద బంగార్రాజు తప్ప మరే ప్రాజెక్ట్ చేతిలో లేదు. అందుకే ఈ చిత్రంనే మొదట చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రంలో నాగార్జున వయసుకు తగ్గ పాత్రను చేస్తాడని సమాచారం అందుతోంది. సోగ్గాడే చిన్ని నాయన చిత్రంకు ఇది సీక్వెల్‌గా రాబోతుంది.