Site icon TeluguMirchi.com

నడి రోడ్ ఫై నాగ్ కి ముద్దుపెట్టిన మహిళా….

nag_kiss-leadyకింగ్ నాగార్జున కు తిరుపతి లో చేదు అనుభవం జరిగింది…తిరుమలశ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల కు వచ్చిన నాగార్జున చేతిపై ముద్దు పెట్టి అక్కడ ఉన్న అందర్ని షాక్ కి గురి చేసింది ఓ మహిళా అభిమాని.

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు టిటిడి పాలకమండలి సభ్యుడి గా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఆయన్ని అభినందించడానికి అలాగే శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన నాగార్జున దర్శనం అనంతరం మీడియా తో మాట్లాడుతుండగా ఓ మహిళా అభిమాని వచ్చి నాగార్జున చేతిని పట్టుకొని ముద్దు పెట్టి తన అభిమానాన్ని చాటుకుంది. ఇది చూసిన వారందరు షాక్ కు గురియ్యారు. మరికొందరు లేడి ఫాన్స్ ఆ ఛాన్స్ మాకు దక్కలేదని బాధ పడ్డారు.

ప్రస్తుతం నాగర్జున ‘సోగ్గాడే చిన్ని నాయన ‘ మూవీ చేస్తున్నాడు. కళ్యాణ్ కృష్ణ అనే నూతన దర్శకుడు వెండి తెరకు పరిచయం కాబోతున్నాడు. రమ్య కృష్ణ, లావణ్య త్రిపతి, బ్రహ్మానందం ,హంస నందిని ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

Exit mobile version