Site icon TeluguMirchi.com

Nagarjuna : క్షమాపణలు చెప్పిన నాగార్జున..?

సామాన్యంగా సినిమా సెలెబ్రిటీలు కనిపిస్తే అందరు ఫోటో తీసుకోవడానికి, కలవడానికి, మాట్లాడటానికి ప్రయత్నిస్తారు. అలాగే అక్కినేని నాగార్జున ఒక ఎయిర్పోర్ట్లో ఉండగా ఓ పెద్దాయన దగ్గరకి వచ్చారు. అది గమనించిన బౌన్సర్ ఆ పెద్దాయనను తోయగా కింద పడిపోబోయారు. ఇది అంతా గమనించని నాగార్జున యదావిధిగా అక్కడ నుండి వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

NKR21 : మళ్ళీ ‘వైజయంతి IPS’ గా విజయశాంతి.. ఫస్ట్ లుక్ అదుర్స్ !

దీనిపై స్పందించిన నాగార్జున.. ఇది నా దృష్టికి వచ్చింది. ఇలా జరగకూడదు. నేను పెద్దమనిషికి క్షమాపణలు చెబుతున్నాను. భవిష్యత్తులో అలా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాను అని నాగార్జున తెలిపారు. ఇకపోతే ‘నా సామిరంగ’ చిత్రంతో హిట్ అందుకున్న నాగార్జున తన తదుపరి చిత్రం గురించి అధికారికంగా ప్రకటించలేదు.

Exit mobile version