భాయ్‌ తో పోటీపడనున్న సోనూసూద్‌

Nagarjuna_sonu_sood_bhai“బొమ్మాళీ నిన్నొదలా!” అన్న డైలాగ్‌ వినగానే మనకు ఇద్దరు గుర్తొస్తారు. ఒకరు తన గొంతుకతో తెలుగు ప్రేక్షకులను వణికించిన “అంధకాసురుడు”… రవిశంకర్‌. మరొకరు ఆ డైలాగ్‌ పలికిన పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన నటుడు సోనూసూద్‌. బాలీవుడ్‌ కు చెందిన నటుడయినా, అక్కడ సరైన అవకాశాలు రాక తెలుగు సినిమాలలో విలన్‌ పాత్రల్లో పరిచయమయి పాపులర్‌ అయిపోయాడు సోనూ. కేవలం విలనీకే పరిమితమయిపోకుండా కామెడీ తో సహా అన్నిరకాల షేడ్స్‌ పలికించగలనని తన నటనతో నిరూపించుకున్నాడు. ఇప్పుడు తెలుగు సినిమాల్లో హీరోయిజానికి సరిసమానంగా విలనిజం చూపించాల్సిన పాత్ర ఉందంటే దాదాపుగా మన దర్శకులు, హీరోలందరికీ గుర్తొచ్చే నటుడిగా మారిపోయాడు సోనూసూద్‌. ఏక్‌ నిరంజన్‌, కందిరీగ, అతడు, దూకుడు… ఇలా ఎన్నో ఉదాహరణలు మనకు కనిపిస్తాయి. అప్పుడెప్పుడో నాగార్జునతో కలిసి, తనకు స్నేహితుడుగా ప్రాధాన్యత కలిగిన పాత్రలో “సూపర్‌” సినిమాలో మెప్పించిన సోనూసూద్‌ ఇప్పుడు మళ్లీ వీరభద్రం చౌదరి దర్శకత్వంలో నాగ్‌ నటించబోతున్న తాజా చిత్రం “భాయ్‌” లో మరోసారి ఓ మంచి పాత్రలో కనిపించబోతున్నాడట. ఈ పాత్ర కూడా సూపర్‌ లో ఉన్నట్టే సినిమాలో చాలా కీలకంగా ఉండబోతున్నట్టు సమాచారం. ఈ భాయ్‌ చిత్రంలో నాగార్జున సరసన రిచా గంగోపాధ్యాయ ఆడిపాడనుంది.