ఇదంతా కూడా సరదాగా సాగింది. రాహుల్ రవీంద్రకు ఇద్దరు కుర్రాలు కూర్చుని ఉన్న టేబుల్ వద్దకు వెళ్లి వారు ఆర్డర్ చేసిన జ్యూస్ తాగమంటూ చెప్పాడు. అతడి నుండి లాగేసుకుని జ్యూస్ తాగుతుంటే చిన్నపాటి గొడవే జరిగింది. ఆ తర్వాత వెయిటర్‌తో గొడవ పడటం, అమ్మాయి వద్దకు వెళ్లి టీజ్ చేయడం వంటివి కూడా చేయడం జరిగింది. మొత్తానికి రాహుల్ రవీంద్రను నాగార్జున ఒక ఆట ఆడేసుకుని వదిలేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. నాగార్జునకు జోడీగా ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఈ చిత్రం నాగ్ కెరీర్‌లో మరో హిట్‌గా నిలుస్తుందని అంటున్నారు.