‘మన్మధుడు 2’ చిత్రం మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం భారీ ఎత్తున విడుదలకు సిద్దం అవుతుంది. నాగార్జున ఈమద్య కాలంలో సరైన సక్సెస్‌ను దక్కించుకోలేదు. దాంతో ఈ చిత్రంతో అయినా సక్సెస్ దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ సందర్బంగా నాగార్జున చిత్ర ప్రమోషన్స్‌ను చాలా విభిన్నంగా చేస్తున్నాడు. భారీ ఎత్తున ప్రమోషన్స్ కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యుల గురించి నాగార్జున మాట్లాడుతూ ఒక వీడియోను విడుదల చేయడం జరిగింది.
నాగార్జున ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన వెన్నెల కిషోర్ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాకు కిషోర్ వెన్నెల వంటి వాడు. మమ్మల్ని తెగ నవ్వించేవాడు. సినిమా షూటింగ్ చాలా సరదాగా సాగడానికి కారణం అతడే. మన్మధుడు చేసే సమయంలో ఎంతగా నవ్వానో మళ్లీ ఇప్పుడు అంతగా నవ్వాను అన్నాడు. ఇద్దరం కలిసి రోజు షూటింగ్‌కు వెళ్లడం, ఇద్దరం కలిసి బోజనం చేయడం వంటివి చేసేవాళ్లం. ఇండస్ట్రీలో మంచి ప్రతిభ ఉన్న నటుడు వెన్నెల కిషోర్ అంటూ నాగార్జున ప్రశంసలు కురిపించాడు.