నాగార్జున మాట్లాడుతూ మా పెద్దబ్బాయి నాగచైతన్య మజిలీ చిత్రంతో సక్సెస్ కొట్టాడు, కోడలు సమంత ‘ఓ బేబీ’ చిత్రంతో మంచి విజయాలను దక్కించుకున్నారు. ఈసారి నేను వారిద్దరిని మించిన సక్సెస్‌ను దక్కించుకోబోతున్నాను అంటూ నమ్మకంగా చెబుప్పాడు. ఓబేబీ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను నమోదు చేయడంతో పాటు సమంతకు మంచి పేరు తెచ్చి పెట్టింది. కొడుకు, కోడలి సినిమాలను మించి తన మన్మధుడు 2 ఉంటుందని నాగార్జున చాలా నమ్మకంగా ఉన్నాడు. మరి ఆయన నమ్మకం ఏ మేరకు నిలుస్తుందో చూడాలి.