కొడుకు, కోడలిని మించి సక్సెస్‌ కొడతానంటున్నాడు

అక్కినేని నాగార్జున ఈనెల 9వ తారీకున ‘మన్మధుడు 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. భారీ అంచనాల నడుమ దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరిగి పోతూనే ఉన్నాయి. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్‌ ఫుల్‌ స్వింగ్‌లో జరుగుతున్నాయి. తాజాగా నాగార్జున మీడియా సమావేశంలో మాట్లాడుతూ మన్మధుడు 2 చిత్రం ఖచ్చితంగా సక్సెస్‌ అవుతుందనే నమ్మకంను వ్యక్తం చేశాడు.

నాగార్జున మాట్లాడుతూ మా పెద్దబ్బాయి నాగచైతన్య మజిలీ చిత్రంతో సక్సెస్‌ కొట్టాడు, కోడలు సమంత ‘ఓ బేబీ’ చిత్రంతో మంచి విజయాలను దక్కించుకున్నారు. ఈసారి నేను వారిద్దరిని మించిన సక్సెస్‌ను దక్కించుకోబోతున్నాను అంటూ నమ్మకంగా చెబుప్పాడు. ఓబేబీ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను నమోదు చేయడంతో పాటు సమంతకు మంచి పేరు తెచ్చి పెట్టింది. కొడుకు, కోడలి సినిమాలను మించి తన మన్మధుడు 2 ఉంటుందని నాగార్జున చాలా నమ్మకంగా ఉన్నాడు. మరి ఆయన నమ్మకం ఏ మేరకు నిలుస్తుందో చూడాలి.