Site icon TeluguMirchi.com

ప్రివ్యూ టాక్ : సందీప్ కిషన్ ‘నగరం’

nagaram-preview-talkగత కొంతకాలంగా వరుస ప్లాప్స్ తో సతమవుతున్న సందీప్ కిషన్ , తాజాగా నగరం మూవీ తో ఈ నెల 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగు , తమిళ్ భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ సరైన డేట్ కోసం ఇంతకాలం ఎదురుచూస్తూ ఇప్పుడు థియేటర్స్ లోకి రాబోతుంది..

ఈరోజు సాయింత్రం చిత్ర ప్రివ్యూ ను హైదరాబాద్ లో ప్రదర్శించడం జరిగింది. ఇక సినిమా విషయానికి వస్తే..నాల్గు పాత్రలతో సినిమా అంత నడుస్తుంది. సినిమా మొదలు నుండి చివరి వరకు కూడా ఏం జరుగుతుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కదులుతుంటుంది. దర్శకుడు లోకేష్ రాసుకున్న స్క్రీన్ ప్లేని తెర ఫై అద్భుతంగా చూపించడం లో సక్సెస్ అయ్యాడు. అలాగే సందీప్ సైతం కథలో నీలమైపోయాడు. ఓ హీరో అనేది మరచిపోయి సాధారణ యువకుడి మాదిరి నటించి , తనపై డైరెక్టర్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. కాకపోతే హీరోయిన్ రెజీనా – సందీప్ ల మధ్య సన్నివేశాలు పెద్దగా లేవు. కథలో రెజీనా పాత్ర పెద్దగా ఏమి లేదు. జస్ట్ సినిమాకు హీరోయిన్ కావాలి అనుకోని పెట్టారనుకుంటా.

సెల్వకుమార్ సినిమాటోగ్రఫి చాలా బాగుంది. క్రైమ్ సన్నివేశాల్ని చాలా రియలిస్టిక్ గా చూపించాడు. చెన్నై మహా నగరాన్ని స్క్రీన్ మీద ఆవిష్కరించిన తీరు బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. డైరెక్టర్ కూడా మంచి మార్కులు కొట్టేసాడు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు సందీప్ కు నగరం మంచి విజయాన్ని అందిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక పూర్తి రివ్యూ …రేటింగ్ కోసం తెలుగు మిర్చి .కం రిఫ్రెష్ చేస్తూనే ఉండండి.

Exit mobile version