Site icon TeluguMirchi.com

నాగచైతన్య ఒక ఇంటివాడయ్యాడు..


నాగచైతన్య ఒక ఇంటివాడయ్యాడు అంటే.. కొత్త ఇంట్లో గృహప్రవేశం చేశాడు. సమంతతో పెళ్లి తర్వాత నాగచైతన్య ఒక కొత్త ఫ్లాట్ ని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అది కూడా మురళీమోహన్ దే. ఆ ఇంటిని వేరే వాళ్లకు అమ్ముదామని అనుకుంటున్న సమయంలో నాగ చైతన్య, సమంత వచ్చి అడిగారని దాంతో కాదనలేక వారికే ఆ ఇల్లు ఇచ్చినట్లు మురళి మోహన్ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే విడాకుల అనంతరం నాగచైతన్య ఆ ఇంటిని సమంతకే ఇచ్చేసాడు.

ఇక నాగచైతన్య ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత హోటల్లోనే ఉంటున్నాడు. ఎలాంటి షూటింగ్ ఉన్నా కూడా వీలైనంతవరకు హోటల్స్ లోనే ఉంటూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నట్లు ఒక టాక్ అయితే వినిపించింది. ఇకపోతే చై తనకంటూ ఒక సొంత ఇల్లును నిర్మించుకోవాలని.. నాగార్జున ఇంటికి దగ్గర్లో కొంత స్థలం కొని తన అభిరుచికి తగ్గట్లు ఇంటిని నిర్మించుకున్నాడు. పది రోజుల క్రితమే నాగచైతన్య ఆ ఇంట్లోకి గృహప్రవేశం కూడా చేశాడు. పూర్తిగా తన ఇష్టంతో చై తన ఇంటిని డైజైన్ చేయించుకున్నాడు. ఇక ఆ ఇంట్లోనే ప్రత్యేకంగా స్విమ్మింగ్ పూల్, జిమ్, మినీ థియేటర్ రూమ్ ఉండేలా డిజైన్ చేయించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం నాగచైతన్య అయితే తన కస్టడీ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు.

Exit mobile version