నాగచైతన్య ‘కస్టడీ’ ఫస్ట్ సాంగ్ రిలీజ్..


యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ కస్టడీ. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా దీనిని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుండి ఇటీవలే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ అందరిని ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను చిత్రబృందం విడుదల చేసింది. హెడ్ అప్ హై.. అంటూ వచ్చిన ఈసాంగ్ పోలీసుల డ్యూటీ అలాగే వారి గొప్పతనం గురించి తెలియజేసింది. కాగా రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటను.. యువన్ శంకర్ రాజా, అరుణ్ కౌండిన్య, అసల్ కోలార్ కలిసి ఆలపించారు. ఇక అరవింద స్వామి కీలక పాత్ర పోషిస్తున్నారు. లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా మరియు యువన్ శంకర్ రాజా సంగీతం అందిసున్న ఈసినిమా మే 12న తెలుగుతో పాటు తమిళ్ లో కూడా విడుదలకానుంది.