Site icon TeluguMirchi.com

‘కస్టడీ’ థియేటర్ లో బ్లాస్ట్ అవుతుంది.. కొత్త చై ని చూస్తారు : నాగ చైతన్య


యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య, లీడింగ్ ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభు ల తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ ‘కస్టడీ’ మోస్ట్ ఎవైటెడ్ మూవీస్‌లో ఒకటి. కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై భారీ నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే విడుదల అయిన టీజర్, ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మే 12న సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో కస్టడీ ప్రీరిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్.

ఈ సందర్భంగా హీరో నాగచైతన్య మాట్లాడుతూ..”అభిమానులు, ప్రేక్షక దేవుళ్ళకు కృతజ్ఞతలు. కస్టడీ కథ వెంకట్ ప్రభు గారు చెప్పినప్పుడు లేచి ఆయన్ని గట్టిగా హాగ్ చేసుకున్నాను. నాకు అంత ఎక్సయిట్ మెంట్ ఇచ్చింది ఈ కథ. ఎడిటింగ్ రూమ్ లో చూసినప్పుడు కూడా అదే ఎక్సయిట్ మెంట్ ఇచ్చింది. వెంకట్ ప్రభు గారికి థాంక్స్. తమిళ్ లో ఆయన ఎన్నో హిట్లు ఇచ్చారు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులని అలరించడానికి వచ్చిన ఆయనకు స్వాగతం పలుకుతున్నాను. ఇక నా కెరీర్ లో మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీ ఇది. అరవింద్ స్వామి గారు ఈ కథ కి ఓకే చెప్పడంతో మా అందరికీ చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ చిత్రంతో కృతి శెట్టి కెరీర్ మరో స్థాయికి వెళుతుందని నమ్ముతున్నాను. ఇకపోతే సినిమా మొదటి ఇరవై నిమిషాలు కూల్ గా వెళుతుంది. ఇంటర్వెల్ కి ముందు నుంచి థియేటర్ లో బ్లాస్ట్ అవుతుంది. అద్భుతమైన యాక్షన్స్ సీక్వెన్స్ లు వుంటాయి. మీరు కొత్త చై ని చూడబోతున్నారు. వెంకట్ ప్రభుగారు అలా డిజైన్ చేశారు. మీ అందరూ నా కస్టడీ లోకి రావాలని, నా కస్టడీలోనే ఉండాలని కోరుకుంటున్నాను. మే 12న అందరం థియేటర్ లో కలుద్దాం. లవ్ యూ ఆల్’’ అన్నారు.

Exit mobile version