Site icon TeluguMirchi.com

మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్!

nagaయువ‌త‌, సోలో సినిమాల‌తో త‌న‌ని తాను నిరూపించుకొన్నాడు ప‌ర‌శురామ్‌. అయితే భారీ అంచ‌నాలు పెట్టుకెళ్లిన సినిమాల్నీ నిరాశ ప‌ర‌చాయి. యువ‌త త‌ర‌వాత వ‌చ్చిన ఆంజ‌నేయులు, సోలో త‌ర‌వాత తీసిన సారొచ్చారు ఫ్లాప్‌ల లిస్టులో చేరిపోయాయి. ఓ హిట్టు, ఓ ఫ్లాప్ అంటూ త‌న కెరీర్‌ని బ్యాలెన్స్ చేసుకొంటున్నాడీ ద‌ర్శకుడు. ఇప్పుడు నాగ‌చైత‌న్యకు క‌థ చెప్పాడ‌ట‌. చైతూ కూడా ఓకే చెప్పినట్లు వినికిడి . ప్రస్తుతం చైతూ ఫుల్ బిజీలో ఉన్నాడు. అత‌ని చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఇది ఐదోద‌న్నమాట‌. శ్రీ‌నివాస‌రెడ్డి, కొండా విజ‌య్ కుమార్ ఆల్రెడీ క‌థ‌లు చెప్పేశారు. ఇప్పుడు ప‌ర‌శురామ్ కూడా చేరాడు. వీరిలో ఎవ‌రి సినిమా ముందుగా సెట్‌కి వెళ్తుందో మ‌రి.

Exit mobile version