‘ ఆరెంజ్ ‘ మూవీ తో కోట్ల నష్టాన్ని చవిచూసిన నాగబాబు , మళ్లీ ఇంతకాలానికి నిర్మాతగా ఓ సినిమా చేయబోతున్నాడు. కాకపోతే ఈసారి నిర్మాతగా కాకుండా కో ప్రొడ్యూసర్ గా రాబోతున్నాడు. స్టార్ రైటర్ గా గుర్తింపు సాధించిన వక్కంతం వంశీ , డైరెక్టర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. మొదటగా ఎన్టీఆర్ తో సినిమా అనుకున్నప్పటికీ , ఎన్టీఆర్ హ్యాండ్ ఇచ్చేసరికి అదే కథను బన్నీ తో చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబదించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మొదలు పెట్టాడు.
ఇక ఈ మూవీ ని లగడపాటిశ్రీధర్ నిర్మిస్తున్నాడనే వార్తలు ఫిలిం సర్కిల్లో వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీకి మరో ఇద్దరు ప్రొడ్యూసర్లు జాయిన్ అయ్యారట.వారే బన్నీ వాసు మరియు నాగబాబు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఆరెంజ్ సినిమాతో దెబ్బతిన్న నాగబాబును ఆదుకోవాలని చాల ఏళ్ల నుండి బన్నీ అనుకుంటున్నాడట. అదే విషయం లగడపాటికి చెప్పాడట. దాంతో లగడపాటి, మీరెలా చేద్దాం అంటే అలాగే చేద్దాం అనేయడంతో, ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్ గా, సినిమాకు సమర్పకుడిగా నాగబాబు ను డిసైడ్ చేశారట. నాగబాబు పెట్టుబడి ఏమీ పెట్టరు కానీ, రాయల్టీరూపంలో కొత్త లాభం ఇస్తారని తెలుస్తోంది. మొత్తానికి బన్నీ సినిమాకు ముగ్గురు నిర్మాతలన్నా మాట.