Site icon TeluguMirchi.com

నిహారికతో పెళ్లి నాగశౌర్య మాటిది


నాగశౌర్య, నిహారిక… ఈమధ్య వీళ్లిద్దరిపై రూమర్లు పెద్ద ఎత్తున వస్తున్నాయి. త్వరలోనే నిహారిక, నాగశౌర్య పెళ్లి చేసుకుంటారని, రెండేళ్లుగా వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలొచ్చాయి. దీనిపై నాగశౌర్య రియాక్ట్ అయ్యాడు.

“నిహారిక, నేను పెళ్లి చేసుకుంటామంటూ వార్తలు వస్తున్నాయి. అదే కాదు నేను నటించిన సినిమాల్లోని కథానాయికలతో నాకు సంబంధాలు ఉన్నట్లు వార్తలు రాసేస్తున్నారు. ‘కళ్యాణవైభోగమే’ నాయిక మాళవికతో, ‘వూహలు గుసగుసలాడే’ నాయిక రాశీఖన్నాతో, ‘ఒకమనసు’ నాయిక నిహారికతో. ప్రేమలో ఉన్నట్లు వదంతులు సృష్టించారు. ఇప్పుడు నిహారికతో పెళ్లని రాస్తున్నారు. వాటిని మొదట పట్టించుకోలేదు. నాకు ఎవరితోనూ ఎటువంటి సంబంధం లేదు. ఆడవాళ్ళతో మాట్లాడాలంటే నాకు సిగ్గుగా ఉంటుంది. నేను మా అమ్మ చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటా” అని తేల్చి చెప్పాడు నాగశౌర్య.

Exit mobile version