Site icon TeluguMirchi.com

ఫస్ట్ లుక్ : నాగ శౌర్య అమ్మమ్మగారిల్లు

ఛలో సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు నాగ శౌర్య . వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ప్రస్తుతం మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇప్పుడాయన ఆయన కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ ఐయింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు అమ్మమగారిల్లు అనే టైటిల్ ను సెట్ చేశారు.

సుందర్ సూర్య ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండగా రసూల్ ఎల్లోర్ – కళ్యాణ్ రమణ వంటి టెక్నీషియన్స్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. ఇక హీరోయిన్ విషయానికి వస్తే.. బేబీ షామిలిగా అంద‌ర్నీ ఆక‌ట్టుకొన్న బాల‌న‌టి.. ఆత‌ర‌వాత ఓయ్ సినిమాతో హీరోయిన్ గా మారిన సంగ‌తి తెలిసిందే. ఓయ్ ఫ్లాప్ అవ్వ‌డంతో సామిలిని అంద‌రూ లైట్ తీసుకొన్నారు. ఆ త‌ర‌వాత తెలుగు సినిమాల్లో క‌నిపించ‌నే లేదు. ఇంత‌కాలానికి మ‌ళ్లీ సామిని తెర‌పైకి వ‌స్తోంది.

Exit mobile version