Site icon TeluguMirchi.com

‘ఒక లైలా కోసం’ అంటున్న చైతు

chaituఅక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘రాముడు కాదు కృష్ణుడు’ చిత్రంలోని ‘ఒక లైలా కోసం … తిరిగాను దేశం’ అనే పాట అప్పటికి, ఇప్పటికి చాలా పాప్యులర్. ‘ఒక లైలా కోసం’ అనే లిరిక్ బాగా క్యాచి గా ఉంటుంది. అందకే నాగ చైతన్య తన కొత్త సినిమా కు తాతయ్య హిట్ సాంగ్ ‘ఒక లైలా కోసం’ లిరిక్ నే టైటిల్ గా ఫిక్స్ చేశాడని సమాచారం. పైగా స్టోరి లైన్ కు ఈ టైటిల్ సరిగ్గా నప్పుతుందట. ఈ చిత్రానికి ‘గుండె జారి గల్లంతయ్యిందే’ చిత్ర దర్శకుడు విజయకుమార్ కొండా దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే టైటిల్ ను అధికారికంగా ప్రకటిస్తారు.

Exit mobile version