అక్కినేని హీరోల పెళ్లి వేదిక ఫిక్స్…?

naga-chaitanya-akhil-mrg-veఅక్కినేని వారసులు నాగ చైతన్య , అఖిల్ లు పెళ్లికి రెడీ అయ్యారు.ఇద్దరు ప్రేమ వివాహాలు చేసుకోబోతున్నారు..చైతు సినీ హీరోయిన్ ని చూసుకుంటే , అఖిల్ తన చిన్న నాటి స్నేహితురాలుని చేసుకోబోతున్నాడు..ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీ వీరి ప్రేమ వివాహాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో డిసెంబ‌రులో పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసారని తెలుస్తుంది..అలాగే పెళ్లి వేదిక కూడా ఒకే అయ్యిందట..

తాజా సమాచారం ప్రకారం ఇద్దరి వివాహం ఒకే రోజు , ఒకే వేదిక పై జరగనున్నాయట..అంతే కాదు ఇప్పటివరకు జరిగిన సినీ సెలబ్రిటీల మ్యారేజిలన్నింటినీ తలదన్నేలా ఈ రెండు వివాహాలు చేయాలనే ప్లాన్ చేస్తున్నాడట నాగార్జున..హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో వీరి వివాహ వేడుకకు వేదిక కాబోతోందని తెలుస్తోంది. ఇది ఎంత వరకు నిజం అనేది నాగ్ చెప్పాలి…