Site icon TeluguMirchi.com

Thandel : ఈపాలి యేట.. గురి తప్పేదెలేదేస్.. ఇక రాజులమ్మ జాతరే


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా టాలెంటెడ్ దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘తండేల్’. ఈ చిత్రాన్ని మేకర్స్ కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తుండగా, ఈరోజు అయితే సినిమా అవైటెడ్ ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు.

చేపలు పట్టడానికి సముద్రం మధ్యలో వున్న యువ సామ్రాట్ నాగ చైతన్య పాత్రను పరిచయం చేయడంతో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. ‘ఈపాలి యేట.. గురి తప్పేదెలేదేస్.. ఇక రాజులమ్మ జాతరే’ అని చైతు చెప్పిన మ్యాసీ డైలాగ్ ఆకట్టుకుంటుంది. అంతేకాదు నాగ చైతన్య మునుపెన్నడూ చూడని రస్టిక్ అవతార్‌లో కనిపించారు. శ్రీకాకుళం యాసని అద్భుతంగా పలికారు. ఇక రాజు ప్రేమికురాలిగా సాయి పల్లవి పోషించిన బుజ్జి తల్లి పాత్రని పరిచయం చేయడంతో గ్లింప్స్ ఆహ్లాదకరంగా ముగుస్తుంది.

గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నిర్మాణంతో పాటు సాంకేతిక ప్రమాణాలు అత్యున్నతంగా ఉన్నాయి. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ నేపధ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలో జరుగుతోంది.

Essence of #Thandel | Naga Chaitanya | Sai Pallavi | Chandoo Mondeti | DSP | Bunny Vas | Geetha Arts

Exit mobile version