సిక్స్‌ప్యాక్ చేస్తాడ‌ట‌!

Naga-Chaitanya-Six-Packటాలీవుడ్‌ ని సిక్స్‌ప్యాక్ ఫీవ‌ర్ ఇంకా వ‌ద‌ల్లేదు. సునీల్ కూడా సిక్స్‌ప్యాక్ చేశాక‌… మ‌నం చేయ‌లేమా?? అనుకొంటున్నారో ఏమో.. అంద‌రూ అదే దారిలో న‌డుస్తున్నారు. ఇప్పుడు నాగ‌చైత‌న్య కూడా ష‌ర్టు విప్పి త‌న సిక్స్‌ప్యాక్ బాడీ చూపించ‌డానికి సిద్ధమ‌వుతున్నాడు. ‘త‌డాఖా’లో యాక్షన్ ఎపిసోడ్ల‌ లో రాణించాడు ఈ బుల్లి నాగార్జున‌. ఈ స‌న్నివేశాలు చైతూలో కాన్పిడెన్స్‌ ని అమాంతం పెంచేశాయి. ఇంకాస్త బాడీ ఉంటేనా… ఇంకా బావుండేది.. అని చైతూ భావిస్తున్నాడు. అందుకే సిక్స్‌ ప్యాక్ చేయ‌డానికి రంగం సిద్ధం చేసుకొంటున్నాడు. సునీల్‌ కి సిక్స్‌ప్యాక్ ట్రైన‌ర్‌ గా ప‌నిచేసిన ఖ‌లీల్‌… ఇప్పుడు నాగ చైత‌న్యని కూడా షేప‌ప్ చేసే ప‌నిలో ప‌డ్డాడ‌ట‌. మ‌రి చైతూ ష‌ర్టు విప్పే మూమెంట్ ఎప్పుడో చూడాలి.