పెళ్లి కి రెడీ అంటున్న నాగచైతన్య…

Naga-Chaitanya-mrg-redyఅక్కినేని వారసుడిగా ‘జోష్’ చిత్రం తో తెలుగు తెరకు పరిచయమయ్యాడు నాగచైతన్య . ఆ తర్వాత ఏ మాయ చేసావే తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో తనకు కాబోయే భార్య గురించి మీడియా తో చెప్పుకున్నాడు. పెళ్లి ఎప్పుడని అడగగా “‘‘నా పెళ్లి రేపైనా ఉండొచ్చు, లేదా పదేళ్ల తర్వాతైనా ఉండొచ్చు. అరేంజ్డ్‌ మ్యారేజ్‌కైనా, లవ్‌ మ్యారేజ్‌కైనా.. రెండింటికీ ఓపెన్‌గానే ఉన్నాను. ఇంట్లో కూడా చెప్పాను, ‘మీకెవరైనా అమ్మాయి తెలిస్తే చెప్పండి, లేదా నేనే అమ్మాయిని తీసుకొస్తాను’ అంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు చాలా జోష్ గా సమాధాలను ఇచ్చాడు.

ప్రస్తుతం నాగచైతన్య దోచేయ్ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. సుదీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కామెడీ & క్రైమ్ గా అందరిని ఆకట్టుకుంటుంది. నాగచైతన్య కు జోడిగా కృతి సనన్ నటించింది, అలాగే బ్రహ్మానందం, సప్త గిరి కామెడీ సినిమా కె హైలైట్ గా నిలిచింది.