Site icon TeluguMirchi.com

మళ్ళీ చైతో రకుల్ రోమాన్స్

రకుల్ ప్రీత్ సింగ్ జోరు ఈ మధ్య కాస్త తగ్గింది. వరుసగా పెద్ద సినిమాలతో అలరించింది రకుల్. ఎన్టీఆర్ , మహేష్ , బన్నీ , రామ్ చరణ్ ఇలా బడా స్టార్స్ తో జతకట్టేసింది. ఐతే ఈ మధ్య ఆమె కెరీర్ కాస్త డ్రాప్ అయినట్లు కనిపించింది. కానీ బాలీవుడ్ కి వెళ్ళింది ఈ భామ. అయితే బాలీవుడ్‌లో ఆమె నటించిన ‘అయ్యారి’ కాస్త నిరాశ పరిచింది. దీంతో పాటు ఆమె పాత్రకు కూడా పెద్ద పేరు రాలేదు.

అయితే ఇప్పుడీ భామ ఓ టాలీవుడ్ ఆఫర్ ని మళ్ళీ ఖాతాలో వేసుకుంది. మళ్ళీ చైతుతో జతకడుతుంది అమ్మడు. గతంలో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రంతో నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ లుజంటగా నటించారు. ఇపుడు కృష్ణ వంశీ దగ్గర దర్శకత్వ విభాగంలో పనిచేసిన సౌజన్య చెప్పిన కథ నచ్చడంతో ఆమెతో కలిసి పనిచేసే ఆలోచనలో ఉన్నాడట చైతు. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కూడ సౌజన్య స్క్రిప్ట్ పట్ల ఇంప్రెస్ అయి సినిమా చేయడానికి సుముఖంగా ఉందట. త్వరలోనే దీనిపై ఒక ప్రకటన రానుంది.

Exit mobile version