‘మజిలీ’ చిత్రం సక్సెస్‌తో నాగచైతన్య జోరు పెంచాడు. ఇప్పటికే ‘వెంకీమామ’ చిత్రంలో వెంకీ మామతో కలిసి నటిస్తున్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంను ఇదే ఏడాది చివరి వరకు తీసుకు వచ్చే ఉద్దేశ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు. ఇక తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్‌గా ఒక చిత్రం ప్రారంభం అయ్యింది. ఆ చిత్రం రెగ్యులర్ షూట్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఇదే సమయంలో దిల్‌రాజుతో కూడా ఒక చిత్రం వార్తలు వచ్చాయి. అయితే ఆ చిత్రం ఇప్పట్లో ఉండదని సమాచారం అందుతోంది.
దిల్‌రాజు కొన్ని రోజుల క్రితం నాగచైతన్యతో ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నం చేశాడట. అయితే కథ ఓకే అయిన తర్వాత అగ్రిమెంట్ చేసుకుందామని నాగచైతన్య చెప్పడం జరిగింది. ఈ చిత్రం కోసం శశి అనే యువ దర్శకుడు కథను సిద్దం చేశాడు. కథ బాగానే ఉన్నా స్క్రిప్ట్ వర్క్ నచ్చక పోవడంతో నాగచైతన్య ప్రస్తుతానికి ఈ చిత్రం వద్దని చెప్పినట్లుగా తెలుస్తోంది. నాగచైతన్య వెంకీ మామ మరియు శేఖర్ కమ్ముల సినిమాలను పూర్తి చేసిన తర్వాత అయినా దిల్‌రాజుకు డేట్లు ఇస్తాడేమో చూడాలి.