అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తన నటనతో కూడా పర్వాలేదనిపించుకున్నాడు నాగ్ తనయుడు అక్కినేని నాగచైతన్య. మొదట్లో కాస్త వెనకబడినా కూడా ఆ తర్వాత కథ పరంగా జాగ్రత్తలు తీసుకుని పర్వాలేదు అనే స్థాయిలో ఉన్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న చైతూ ‘రారండోయ్ వేడుకచూద్దాం’ చిత్రంతో ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను ఇప్పటికే షురూ చేశారు. తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన చైతూ తన తదుపరి సినిమాల గురించి చెప్పుకొచ్చాడు. తన చివరి సినిమాల గురించి చాలా నేర్చుకున్నానని, ముందు ముందు కూడా ఇలాంటి మంచి సినిమాలతోనే మీ ముందుకు వస్తాను అంటూ చైతూ చెప్పుకొచ్చాడు.
అక్కినేని కుటుంబంలో పుట్టడం నా అదృష్టం అని, అయినా నేను ఆ పేరును కాకుండా నా కష్టన్నే నమ్ముకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ నా సినీ కెయిర్ గాడి తప్పి, సరిగా లేకుంటే నాకు ఎంతో ఇష్టమైన రెస్టారెంట్ బిజినెస్ మొదలు పెడుతా, అంతేకాకుండా ఆటోమొబైల్ బిజినెస్ లాంటివి కూడా చేసుకుంటాను అని చెబుతున్నాడు. నీకేంటి బాబు హీరోగా పర్వాలేదు అనే సినిమాలు చేస్తూనే నిర్మాతగా మారి బాగానే చేసుకుంటావ్. డబ్బులు వచ్చాక ఆ సైడ్ బిజినెస్లు ఎలాగు కామనే. త్వరలో చైతూ టాలీవుడ్ హీరోయిన్ సమంతను పెళ్లాడబోతున్నాడు.