Naga Chaitanya : తండేల్ విజయం తర్వాత యువసామ్రాట్ నాగచైతన్య మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ‘విరూపాక్ష’ వంటి సూపర్ నాచురల్ థ్రిల్లర్‌తో సంచలనం సృష్టించిన దర్శకుడు కార్తీక్ దండుతో కలసి ‘NC24’ అనే మిథికల్ థ్రిల్లర్‌ను రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర(SVCC) మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు, బాపినీడు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమాను గతంలోనే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మేకర్స్ ఇచ్చారు.
Also Read : Single Trailer : ‘సింగిల్’ ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్ !!
సంవత్సరాల తరబడి క్రాఫ్టింగ్, నెలల తరబడి ప్లానింగ్, గంటల తరబడి రిహార్సల్స్ అంటూ ఈ సినిమా కోసం వారు పడ్డ శ్రమను చూపిస్తూ ఒక వీడియోను రిలీజ్ చేసారు. “NC24 – The Excavation Begins” వీడియో ద్వారా నాగచైతన్య తన పాత్రలో ఏ స్థాయిలో లీనమయ్యారో స్పష్టంగా తెలుస్తోంది. శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా ఆయన పాత్రలో పూర్తిగా మునిగిపోయారు. ఈ చిత్రం మిథికల్ థ్రిల్లర్ జానర్లో ఓ మైలురాయిగా నిలవనుంది.
ఇక ఈ ప్రాజెక్ట్‌కి అజనీష్ బి లోక్‌నాథ్ సంగీతం అందించగా, నీల్ డి కున్హా సినిమాటోగ్రఫీను, శ్రీ నాగేంద్ర తంగళ్ల ప్రొడక్షన్ డిజైన్‌ను, నవీన్ నూలి ఎడిటింగ్‌ను చూసుకుంటున్నారు. త్వరలోనే సినిమా టైటిల్ మరియు పూర్తి నటీనటుల వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు.