వెంకీమామకి తప్పని విడుదల తిప్పలు

సురేష్‌బాబు నిర్మాణంలో వెంకటేష్‌, నాగచైతన్యల కాంబోలో ‘వెంకీమామ’ తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. వెంకీ, చైతూల సినిమా అనగానే మొదటి నుండే అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ‘ఎఫ్‌ 2’ చిత్రంతో మంచి సక్సెస్‌ను సొంతం చేసుకున్న వెంకీ, ‘మజిలీ’ చిత్రంతో హిట్‌ కొట్టిన చైతూ కాంబోలోని ఈ చిత్రంపై అభిమానులకు అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ చిత్ర విడుదల తేదీకి కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. మొదటగా అక్టోబర్‌ 4న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టుగా యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.

కొన్ని కారణాల వల్ల విడుదల తేదీలో మార్పు చేసి అక్టోబర్‌ 25న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. కానీ అదేరోజున వేరే సినిమాలు కూడా బరిలో ఉండడంతో యూనిట్‌ సభ్యులు ఆలోచనలో పడ్డారు. తాజా సమాచారాన్ని బట్టి డిసెంబర్‌ ఫస్ట్‌వీక్‌లో విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది. కాస్త ఆలస్యం అయినా కూడా సేఫ్‌ జోన్‌లో విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే డిసెంబర్‌ ఫస్ట్‌ వారంలో అయినా విడుదల అవుతుందా లేక మళ్లీ వాయిదా పడుతుందా? అని అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. విడుదల తేదీ ఇలా మారుతూ వస్తుంటే అభిమానుల ఆసక్తి కూడా సన్నగిల్లుతుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు.