Site icon TeluguMirchi.com

నాగ్‌.. నువ్వు మారాలి!

Nagarjunaభాయ్ సినిమాపై నాగార్జున చేసిన కామెంట్లు దుమారాన్ని రేపాయి. ఈ సినిమా చేయ‌డం పాపం అన్నట్టు మాట్లాడాడు నాగ్! ఇలాంటి సినిమాల్ని చేయ‌ను, ఎవ‌రినీ చేయ‌నివ్వను అన్నట్టు భారీ స్టేట్మెంట్లు ఇచ్చాడు. నిజ‌మే.. భాయ్ ఫ్లాపే! కానీ దానికి కార‌ణం మాత్రం వీర‌భ‌ద్రమో, మ‌రొక‌రో కాదు. పూర్తిగా నాగే. త‌న‌కు ఎలాంటి క‌థ‌లు న‌ప్పుతాయో తెలుసుకోవ‌ల‌సింది నాగ్ మాత్రమే. ఇంకా ఏజ్ ఓల్ట్ ఫార్ములా క‌థ‌ల్లో క‌నిపించాల‌ని, ప్రతీ ఫ్రేమ్‌లోనూ యంగ్‌ లుక్‌ లో ద‌ర్శన‌మివ్వాల‌ని, డ్యూయెట్లు పాడాల‌ని అనుకొంటే ఎలా? వ‌య‌సు పెరిగింది. త‌న వార‌సులు హీరోల‌య్యారు. ఇంకా ల‌వ‌ర్‌ బోయ్ పాత్రలే ఎంచుకొంటానంటే ఎలా..?? పైగా భాయ్‌ లో గెట‌ప్ నాగ్‌ కి ఏమాత్రం సూట‌వ్వలేదు. ఫ్రెంచ్ క‌ట్, జుల‌పాల జుత్తు, కాస్ట్యూమ్స్ ఏమాత్రం న‌ప్పలేదు. నాగ్ లాంటి హీరోలు, హీరోయిజం పండించే బాధ్యత ఈ త‌ర‌వానికి వ‌దిలేసి… ‘గ‌గ‌నం’ లాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమాల్ని ఎంచుకోవ‌డం మంచిది. ‘భాయ్‌’ తో ఆ పాఠం నేర్చుకోగ‌లిగితే… చిత్రప‌రిశ్రమ‌కు మేలు చేకూరిన‌ట్టే.

Exit mobile version