నాగ్.. ‘ఆటోనగర్’ కొంటారా?

nagarjuna100%లవ్ చిత్రం తరువాత సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న నాగచైతన్య ‘ఆటోనగర్ సూర్య’ చిత్రం పై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. దేవకట్టా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాణ సంస్థ.. ఆర్.ఆర్
మూవీ మేకర్స్ కష్టాల్లో పడడం వల్ల ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఎంతో కష్టబడి చేసిన ‘ఆటోనగర్ సూర్య’ మధ్యలోనే ఆగిపోవటంతో నాగచైతన్య నిరాశ చెందాడు. దీంతో నాగార్జున ముందడుగు వేసి ఈ చిత్రాన్ని టేకోవర్ చేస్తున్నట్లు వినికిడి. కానీ సరైన ధర కుదరకపోవడం వల్ల ఈ చిత్రం కొనుగోలు పై నాగ్ కాస్త వెనుకడుగు వేస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.