నాగ్ ఓకే చేశాడు!

akhil(2)

సిసింద్రీ అఖిల్ ప‌క్క‌న చిన్నారి పెళ్లికూతురు అవికా న‌టిస్తోందా..? రెండు రోజుల నుంచీ మీడియాలో ఈ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. ఉయ్యాల జంపాల సినిమాతో క‌థానాయిక‌గా ఎంట్రీ ఇచ్చింది అవికా . ఈ చిత్రానికి నాగ్ ఓ నిర్మాత‌గా వ్య‌వ‌హరించారు. ఇందులో అవికా న‌ట‌న‌.. నాగ్‌ కి బాగా న‌చ్చింది. అందుకే అఖిల్ ప‌క్క‌న అవిక‌ను చూడాల‌నుకొన్నారు. అఖిల్ ఈ యేడాదే హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. క‌థ‌, ద‌ర్శ‌కుడు.. ఈ విష‌యాల‌పై నాగ్ ఓ నిర్ణ‌యానికి వ‌స్తున్నారు. ఇప్పుడు ఆయ‌న క‌థానాయిక‌ను కూడా ఓకే చేసిన‌ట్టైంది. అన్న‌పూర్ణ స్టూడియోస్ అవికాతో రెండు సినిమాల‌కు ఎగ్రిమెంట్ రాయించుకొన్న‌ట్టు తెలుస్తోంది. ఒక సినిమా అఖిల్‌ తో. మ‌రి రెండో సినిమాలో హీరో ఎవ‌రో…?!