Site icon TeluguMirchi.com

నాగ్.. ‘సోగ్గాడే’ !

nag-dual-role
‘మనం’ హిట్ తో నాగ్ జోష్ మీదున్నాడు. నూతన దర్శకుడు కల్యాణ్ కృష్ణతో నాగార్జున ఓ కొత్త సినిమా ఖరారైన విషయం తెలిసిందే. ఇందులో నాగ్ ద్విపాత్రభినయం చేయనున్నాడు. ఇప్పటికే ఓ హీరోయిన్ గా రమ్యకృష్ణను తీసుకున్నారు. తాజాగా, ఈ చిత్రం టైటిల్ ను ‘సోగ్గాడే చిన్ని నాయన’ గా ఖరారు చేసినట్లు టాలీవుడ్ సమాచారమ్. అక్కినేని ‘ఆస్తిపరులు’ సినిమాలో ‘సోగ్గాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేదు సొగ్గాడే.. ‘ అనే పాపులర్ పాట వుంది. దీంట్లోని ‘సోగ్గాడే చిన్ని నాయన’ ను టైటిల్ గా తీసుకున్నారని, ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ కూడా చేయించినట్లు సమాచారమ్. టైటిల్ ఫైనల్ అవ్వడం అలా వుంచితే.. ‘సోగ్గాడే చిన్ని నాయన’ నాగ్ కు అచ్చుగుద్దినట్ట్లు సూటవుతుందని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నాగ్ ఈ చిత్రాన్ని నిర్మస్తున్నాడు.

Exit mobile version