Site icon TeluguMirchi.com

‘గ్రీకు వీరుడు’ … నాగ్

Nag is Greek Veeruduదశరథ్ దర్శకత్వంలో నాగార్జున, నయనతార జంటగా కామాక్షీ మూవీస్ అధినేత శివప్రసాద్ రెడ్డి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం టైటిల్ మొదట్లో ‘లవ్ స్టోరీ’ అనీ, ఆ తర్వాత ‘సరిలేరు నీకెవ్వరూ’ అనీ.. రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే నిర్మాత శివ ప్రసాద్ రెడ్డి ఈ చిత్రం కోసం గ్రీకు వీరుడు అనే టైటిల్ ఖరారు చేశారు. దీనికి సంభందించిన పత్రిక ప్రకటన కూడా తాజాగా విడుదలచేశారు.  గతంలో ‘నిన్నేపెళ్ళాడుతా’ సినిమాలో ‘గ్రీకువీరుడు… నా రాకుమారుడు’ అంటూ నాగ్ ను ఉద్దేశించి… టబూ పాడిన పాట పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే పేరును టైటిల్ గా పెట్టడం వల్ల ప్రేక్షకులకు త్వరగా రీచ్ అవుతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. నాగ్ ఈ చిత్రంలో అమెరికాలో పుట్టి పెరిగిన ఎన్ ర్ ఐగా కనిపిస్తారు.  ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం టీజర్ ను ఈ నెల 26 విడుదల చేయనున్నారు.

Exit mobile version