ప్రియమణి ని హర్ట్ చేసిన నాగ్

nagpriyamaniకధానాయికల దగ్గర ఓ స్టాక్ డైలాగ్ వుంటుంది. ఏ హీరో తో చేస్తే ఆ హీరోని తెగ మోసేస్తారు. ‘అబ్బ… ఆయనతో మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సూపర్ హిట్’ అని చెబుతారు. వాటిలో నిజమెంతో మనందరికీ తెలుసు. ఇదే ట్రిక్కు కొంతమంది హీరోలు కూడా రివర్స్ లో ప్లే చేస్తుంటారు. అయితే నాగార్జున మాత్రం వీటన్నింటికీ అతీతంగా మాట్లాడారు. ఆ మాటలకే ప్రియమణి కూడా హర్ట్ అయ్యింది. అసలేం జరిగిందంటే… ‘గ్రీకు వీరుడు’ పాటల వేడుకకు అనుష్క, ప్రియమణి అతిధులుగా హాజరయ్యారు. వేదిక పై.. ఈ భామలిద్దరు వుండగా ఉదయభాను నాగ్ ని ఓ ప్రశ్న వేసింది. ‘మీ పర్ఫెక్ట్ జోడీ ఎవరు?’ అని. నాగార్జున ఏమాత్రం తడుముకోకుండా ‘అనుష్క’ అనేశాడు. దాంతో ప్రియమణి హార్ట్ అయిపొయింది. `మై హార్ట్ ఇస్ బ్రోకెన్..’ అంటూ తెగ బాధపడిపోయింది. ఆ తరవాత నవ్వేసి… లైట్ తీసుకుంది. స్వీటీ పై నాగార్జునకు ఎంత ప్రేమ వుందో…ఈ సరదా సంఘటన మరోసారి రుజువు చేసింది.