Site icon TeluguMirchi.com

ఏఎన్నార్‌కి పుట్టిన రోజు కానుక‌

nag anrత్వర‌లో 90వ వ‌సంతంలోకి అడుగుపెడుతున్నారు అక్కినేని నాగేశ్వరరావు. తొమ్మిద ద‌శాబ్దాలు అంటే మాట‌లా?? త్వర‌లోనే సెంచ‌రీ కొట్టబోతున్నారు. ఈ సంద‌ర్భాన్ని గ్రాండ్ గా నిర్వహించాల‌ని భావిస్తున్నారు నాగార్జున‌. అందుకే తండ్రికి ఓ విలువైన బ‌హుమానం ఇచ్చారు. అదే.. బెంజ్ కార్‌! పుట్టిన రోజుకి నెల రోజుల ముందే నాన్నకి కారు తాళాలు ఇచ్చేశార‌ట‌. ఈ విష‌యం అక్కినేని నాగేశ్వర‌రావు స్వయంగా చెప్పారు. ”పుట్టిన రోజు కానుక అని కాదు గానీ, నాకో కారు బ‌హుమానంగా ఇచ్చాడు. ఇంత‌కు ముందు నేను వాడిన కారు కూడా వాడు ఇచ్చిందే. అది… ఈమ‌ధ్య కాస్త ఇబ్బంది పెడుతోంది. అదే విష‌యం బాబుతో చెప్పా. వెంట‌నే ఈ కారు ఆర్డరిచ్చాడు. ప్రస్తుంతం అందులోనే తిరుగుతున్నా…” అంటున్నారు అక్కినేని.

Exit mobile version