Site icon TeluguMirchi.com

మన్మధుడు గుండుతో కనిపిస్తాడా..?

nag-gunduఎప్పటికప్పుడు వైరటీ కథలే కాదు విభిన్న గెటప్స్ తో కనిపించే నాగ్..త్వరలో గుండుతో కనిపిస్తాడా అనే వార్తలు వినిపిస్తున్నాయి..ప్రస్తుతం ఓం నమో వెంకటేశా చిత్రం పూర్తి చేసిన నాగార్జున , తాజాగా ఓంకార్ దర్శకత్వం లో ‘రాజు గారి గది 2’ లో నటించబోతున్నాడు..ఈ మూవీ లో వైరెటీ మాంత్రికుడిగా కనిపించబోతాడనే వార్తలు వినిపిస్తున్నాయి..ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్ లో తన రోల్ గురించి మీడియా అడుగగా..

“నమో వెంకటేశాయ గెటప్ అయిపోయింది. ఇప్పుడు కుర్రాళ్లంతా గెడ్డాలతో కనిపిస్తున్నారు. నేనేం చేయాలో ఇంకా అనుకోలేదు. ఓంకార్ మాత్రం ఓ గెటప్ స్కెచ్ చేయించి వుంచారు ” అని అన్నాడు. వాస్తవానికి ఈ మూవీ మాతృక మలయాళీ సినిమా, అందులో నాగ్ వేస్తున్న పాత్ర కాస్త డిఫరెంట్ గా వుంటుంది. ఫ్రెచ్ కట్ లాంటి గెడ్డం, పైన నున్నటి గుండు అన్నమాట. మరి నాగార్జున ఆలా కనిపించడానికి ఇష్టపడతాడో లేక వేరే ఏదయినా కొత్త గెటప్ ఆలోచిస్తాడో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read :రజనీ రోబో ‘2.0’ లో నాగ్ .. నిజమా ?

ఇక ఈ మూవీ లో నాగ్ కు జోడిగా రన్ రాజా రన్ , టైగర్ చిత్రాలతో అలరించిన సీరత్ ను ఎంపిక చేయడం జరిగింది. ఓంకార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కి పీవీపీ నిర్మాత. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Exit mobile version