Site icon TeluguMirchi.com

నాగ్ మ‌న‌సు ప‌డ్డాడు!

nag-adriyaహీరో త‌ల‌చుకొంటే.. జ‌ర‌గ‌నిది ఏముంది? అందులోనూ స్టార్ హీరో! ఫ‌లానా హీరోయిన్ కావాల్సిందే అని హుకుం వేస్తే చాలు! ఎక్కడున్నా వెతికి ప‌ట్టుకొని మ‌రీ… తీసుకొస్తారు. మేం చెప్పేది గ్రీకువీరుడు నాగార్జున గురించి. ఆయ‌న ‘త‌డాఖా’ సినిమా ఇటీవ‌ల ప్రత్యేకంగా తిల‌కించారు. చూసొచ్చాక కూడా ఒక‌రి ఫొటో మైండ్‌ లో ముద్రించుకుపోయింద‌ట‌. నాగ‌చైత‌న్యదో, త‌మ‌న్నాదో అనుకొందురు. ఆండ్రియాది, త‌డాఖాలో సునీల్‌ తో జ‌త క‌ట్టిందీ భామ‌. ఆండ్రియా అంద‌చందాలు, న‌ట‌న‌… భ‌లే న‌చ్చేశాయ‌ట‌. అందుకే మ‌రో ఆలోచ‌న లేకుండా ‘నా త‌ర‌వాతి సినిమాలో ఈ అమ్మాయిని తీసుకోండి.’ అని బెల్లంకొండ సురేష్‌ కి ఆర్డురులాంటిది వేసేసే వెళ్లిపోయార‌ట‌. అంటే నాగ్ త‌ర‌వాతి సినిమాలో ఆండ్రియాను చూడొచ్చన్నమాట‌.

Exit mobile version