Site icon TeluguMirchi.com

డిస్పాయింట్ లో నాగ్..

nag-dispaint

అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అనగానే అభిమానుల్లో అంచనాలు మొదలయ్యాయి. శ్రీ వెంకటేశ్వరుడి కి పరమ భక్తుడు అయిన హథీరాం జీవిత గాధ తో మరో భక్తిరస చిత్రంగా ‘ఓం నమో వెంకటేశాయ’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయినా ఈ మూవీ వారి అంచనాలు అందుకోవడం లో విఫలం అయ్యింది. సినిమా బాగా తీసాడు..నాగార్జున మునపటి సినిమాల్లో కల్లా బాగా నటించాడు అని అందరూ ప్రశంసలు కురిపించారు కానీ కమర్షియల్ గా మాత్రం సినిమా డిజాస్టర్ గా తేలింది. దీంతో నాగార్జున చాలా ఫీలయ్యాడని వినికిడి. ఏ మేరకు ఫీలయ్యాడు అంటే రెండు రోజుల పాటు ఎవ్వరితోనూ మాట్లాడలేదట. తనకు తానే అలా రెండు రోజుల పాటు ఎవ్వరి ఫోన్ లు లిఫ్ట్ చేయకుండా, ఎవ్వరితో కలవకుండా ఇంట్లో వుండిపోయినట్లు తెలుస్తోంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ మూవీ ఇలా అవడం ఏంటి అని ఒకటి , వంద సార్లు ఆలోచిస్తూనే ఉన్నాడట. ఆ రెండు రోజుల తర్వాత మళ్లీ బయటకు వచ్చి మాములుగా ఉన్నాడని అంటున్నారు.

Exit mobile version