ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కెమెరామెన్ గా పని చేస్తున్న అశ్విన్ స్నేహితుడు గాయపడ్డాడు. ఆయనను గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అక్కడ వైద్యులు సరైన సమయంలో ట్రీట్ మెంట్ చేయకపోవడంతో తను చనిపోయారు.
ఈ విషయాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ వద్దకు ట్విటర్ వేదికగా తీసుకెళ్లారు నాగ్ ఆశ్విన్. “హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నా మిత్రుడు మరణించాడు సార్. ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ ఎవ్వరూ అందుబాటులో లేరు. మూడు గంటల పాటు ఆయన బాధను అణచిపెట్టి ఆఖరికి మరణించాడు. తల్లిదండ్రులు అతన్ని స్ట్రెచర్ పై మోసుకుంటూ ఆసుపత్రి మొత్తం తిరగాల్సి వచ్చింది. ఆ ప్రభుత్వ ఆసుపత్రికి కాకుండా.. వేరే ఆసుపత్రికి తీసుకెళ్లి ఉంటే నా మిత్రుడు బతికుండేవాడు. ప్రభుత్వాసుపత్రులు మరణాలకు, నిర్లక్యధోరణికి పర్యాయపదం కాదు అని చెప్పడానికి ఏం చేయమంటారు సార్” అని నాగ్ఆశ్విన్ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. “నా మిత్రుడు ఈ రాష్ట్రంలోనే ప్రముఖ కెమెరామెన్. ఈ ఘటన గురించి ఎవర్ని ఏ విధంగా ప్రశ్నించాలో అర్థం కావడంలేదు సర్ అని పోస్ట్‌లో తెలిపారు అశ్విన్. ఈ విషయంపై కేటీఆర్ స్పందించాల్సి ఉంది.
my friend died in gandhi hospital on sunday. he was alive for 3 hours after they brought him from the accident. as it was sunday there was no proper care, the parents had to push the stretcher around themselves. at any other hospital 3 hours would have saved him.
— Nag Ashwin (@nagashwin7) November 27, 2018