విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మాగ్నం ఓపస్ ‘కల్కి 2898 AD’. ఈ విజువల్ వండర్ లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె లీడ్ రోల్స్ లో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మైథాలజీ -ఇన్స్ స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ జూన్ 27న గ్రాండ్ గా విడుదలై ప్రపంచ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షులని మహా అద్భుతంగా అలరించి, ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపధ్యంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ శంకరపల్లిలోని కల్కి సెట్స్ లో గ్రాండ్ గా జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో ‘కల్కి 2898 AD’ విశేషాలని పంచుకున్నారు.
Also Read : బింబిసార2.. ప్రీక్వెల్ అనౌన్స్ చేసిన కళ్యాణ్ రామ్ !
మీడియా ఇంటరాక్షన్ లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. అందరూ మూవీ చూస్తునందుకు, ఎంకరేజ్ చేస్తున్నందుకు, ఇంత గొప్ప సక్సెస్ ని ఇచ్చినందుకు మా టీం, వైజయంతీ మూవీస్ తరపున థాంక్స్. ఇది హోల్ ఇండస్ట్రీ సక్సెస్ గా భావిస్తున్నాను. ఈ క్రమంలో కల్కి సినిమాలోని మహాభారత సన్నివేశాల్లో కృష్ణుడి పాత్రను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు చేసుంటే ఇంకా బాగుండేదని సోషల్ మీడియాలో చర్చిస్తున్నారని.. కల్కి-2 లో మహేశ్ కృష్ణుడిగా కనిపించే అవకాశం ఉందా? అని ఓ విలేకరి అడగ్గా.. కృష్ణుడిగా మహేష్ బాబు బాగుంటాడు. కానీ ఈ సినిమాలో కాకుండా వేరే సినిమాలో చేస్తే బాగుంటుంది అని అన్నారు. అలాగే బుజ్జి గురించి అడగ్గా.. బుజ్జిని డిజైన్ చేయడానికి చాలా కష్టపడ్డాం.. ఏకంగా అటోముబైల్ ఇంజనీరింగే చేశాం. పేటెంట్ రైట్స్ తీసుకున్నాం. టెంపరరీ లైసెన్స్ కూడా ఇచ్చారని చెప్పారు.