కొత్తతరహా పాత్రలు చేయడానికి నాగార్జున ఎప్పుడూ సిద్ధమే. గ్రీకువీరుడులో ఆయన పాత్ర కూడా అలాగే ఉండబోతోంది. ఈ సినిమాలో ఆయన హీరో మాత్రమే కాదు. అప్పుడప్పుడూ నెగిటివ్ కోణాలూ కనిపిస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే.. ఈ సినిమాలో ఆయనే విలన్ కూడా. ఈ విషయం నాగార్జున స్వయంగా వెల్లండించారు. గ్రీకువీరుడులో ఆయన పాత్ర గురించి ప్రస్తావిస్తూ..”దశరథ్ సినిమాలో పాజిటివ్ పాత్రలే ఉంటాయి. అందరూ మంచివాళ్లే. గ్రీకువీరుడులోనూ విలన్లు ఉండరు. ఆ మాటకొస్తే… నా పాత్రలోనే కొన్ని నెగిటివ్ ఛాయలు కనిపిస్తాయి..” అన్నారు. మరి ఒకే పాత్రని రెండు విధాలుగా ఎలా పోషించారో మరి. అన్నట్టు.. మన్మథుడు సినిమాలోనూ ఆయన పాత్రకు కొన్ని నెగిటివ్ లక్షణాలు ఆపాదించారు. అవి భలే ఫన్నీగా ఉంటాయి. మరి గ్రీకువీరుడులో ఈ మన్మథుడు ఏం చేస్తాడో?