జూ. ఎన్టీఆర్ ఎవరో తెలియదన్న మాజీ ముఖ్యమంత్రి

జూ. ఎన్టీఆర్ అంటే తెలియని వారు ఉండరు..అలాంటింది ఎన్టీఆర్ ఎవరో తెలియదని సంచలనం రేపారు మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎలాంటి కష్టాల్లో ఉందో చెప్పాల్సిన పనిలేదు. మళ్లీ పార్టీ కి పూర్వ వైభవం రావాలంటే చంద్రబాబు వల్ల కాదని..నందమూరి ఫ్యామిలీ నుండి జూ. ఎన్టీఆర్ వస్తేనే తెలుగుదేశం పార్టీ కి వైభవం వస్తుందని అంత అనుకుంటున్నారు. ఈ అంశంపై భాస్కర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇలాంటి వార్తలు తాను కూడా విన్నానన్న నాదెండ్ల… దీనిపై తాను ఏమీ మాట్లాడబోనని అన్నారు. అసలు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎవరో కూడా తనకు తెలియదని ఆయన అనడం కొసమెరుపు. తాను సినిమాలు చూడనని అందుకే ఆయన ఎవరో తెలియదని చెప్పుకొచ్చాడు.

మరి జనసేన పార్టీ భవిష్యత్తు ఏంటి అని అంటే.. జనసేన గురించి తాను ఎప్పుడూ మాట్లాడలేదని.. ఇప్పుడు కూడా ఆ పార్టీపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని వెల్లడించారు.