నాని సినిమాకి గుమ్మడికాయ్


నాని ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’. అనుపమ పరమేశ్వరన్‌, రుక్సర్‌ మీర్‌ కథానాయికలు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ఓ ఫైట్ సీక్వెన్స్ తో ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తయింది.

కృష్ణార్జున యుద్ధం సినిమాకు సంబంధించి ఇప్పటికే నాని లుక్స్ రెండింటినీ విడుదల చేశారు. ఒకటి మాస్.. ఇంకోటి రాక్ స్టార్ లుక్. ఇప్పటికే సినిమాకు ప్రమోషన్ ప్రారంభమైంది. ఒక పాట కూడా సూపర్ హిట్ అయ్యింది. ఏప్రిల్ 12న కృష్ణార్జున యుద్ధం థియేటర్లలోకి రానుంది. ఇది రిలీజ్ అయిన వెంటనే శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జునతో కలిసి కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్తాడు నాని.