Site icon TeluguMirchi.com

‘తడాఖా’ దర్శకుడితో నాగ్

Nagarjuna‘తడాఖా’ చిత్ర దర్శకుడు డాలీ తో నాగార్జున కొత్త ప్రాజెక్ట్ ఖరారైంది. ఈ చిత్రాన్ని ‘తడాఖా’ చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి నిర్మాత బెల్లం కొండ చెబుతూ.. “తడాఖా సినిమా చూసి నాగార్జున గారు ఎంతో ఇంప్రెస్ అయ్యారు. అందుకే, డాలీతో ఓ సినిమా చేయడానికి ఆయన అంగీకరించారు. ఆ వెంటనే నాగార్జున కోసం డాలీ అద్భుతమైన కథ రెడీ చేశాడు. మా బ్యానర్లో నాగ్ తో  ఓ భారీ సినిమా తీయాలన్న నా కోరిక దీంతో నెరవేరుతోంది” అన్నారు. ప్రస్తుతం నాగ్ భాయ్ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. భాయ్ షూటింగ్ పూర్తవ్వగానే ఈ  కొత్త ప్రాజెక్ట్ సెట్స్ పై కి వెళ్లనుంది.

Exit mobile version