Site icon TeluguMirchi.com

తమిళ్ లో ‘నాగ్ లవ్ స్టొరీ’

greeku-veeruduనాగ్-నయన్ జంటగా దశరధ్ దర్శకత్వం లో రూపొందుతున్న గ్రీకువీరుడు’ చిత్రం తమిళ్ లోకి అనువాదం కానుంది. తమిళ్ వెర్షన్ కు ‘లవ్ స్టొరీ’గా టైటిల్ ను నిర్ణయించారు. గ్రీకువీరుడు’ చిత్రానికి మొదట్లో ‘లవ్ స్టోరీ’ అనే టైటిల్ అనుకున్నారు. అయితే, నాగ్ కు ‘గ్రీకువీరుడు’ సరైన టైటిల్ అని చెప్పి, దానిని పక్కన పెట్టేశారు. ఇప్పుడు అదే టైటిల్ తో తమిళ్ లో విడుదల చేస్తున్నారు. లవ్ స్టొరీ ని కుడా తెలుగు వెర్షన్ (గ్రీకు వీరుడు ) తో పాటే విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం తమిళ అనువాద హక్కుల్ని గురుబ్రహ్మ ఫిల్మ్స్ సొంతం చేసుకుంది. ఇటివలే ఆడియో వేడుకను జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. తమన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం ఆడియో కు మంచి ఆదరణ లభిస్తుంది. ఈ చిత్రంను ఏప్రిల్ 19న విడుదల చేయడానికి సన్నాహలు చేస్తున్నారు నిర్మాత డి. శివప్రసాద్ రెడ్డి.

Exit mobile version